నందవ.. మెళియాపుట్టి మండలంలో ఓ మారుమూల పల్లె. కానీ ఈ పల్లె నుంచి బిర్యానీ వాసన వచ్చిందంటే తిండి ప్రియులు లొట్టలేసుకుంటూ ఊరికి దారి కడతారు. పర్లాకిమిడి–పలాస దారిలో హీరాపురం గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మారుమూలలో ఉంటుందీ గ్రామం. గ్రామానికి చెందిన సవర అప్పన్న 15 ఏళ్లుగా పూడి గుడిసెలో కట్టెల పొయ్యిపై చికెన్ బిర్యానీ వండి వడ్డిస్తున్నాడు. ఓ ముద్ద బిర్యానీ ఆస్వాది స్తూ ఆ పక్కనే అదే అప్పన్న చేసే చికెన్ పకోడీ నంజుకుంటే ఇక ఆ పూటకు స్వర్గమే. –మెళియాపుట్టి


