శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ●స్టార్‌ అట్రాక్షన్‌ ●పొట్లం బిర్యానీ ●ఆల్‌ వెజ్‌ మిక్స్‌ బిర్యానీ ●సీజన్‌ స్పెషల్‌ నోరూరించే ●దమ్‌ బిర్యానీ ●ఫిష్‌ బిర్యానీ హాట్‌ సేల్‌ ఇక్కడ...

ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
1,50,000

అన్ని రకాలు రుచి చూపించే వంటకం ఇది. మటన్‌, చికెన్‌, రొయ్యలతో పాటు అధిక సంఖ్యలో గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్‌ మాదిరిగా వేసి అందులో బిర్యానీని పొట్లాంను పోలి ఉండేలా వడ్డించడమే దీని ప్రత్యేకత.

హాట్‌ ఫేవరెట్‌ ప్లేస్‌

● నార్తర్న్‌ సిర్కార్స్‌, 80 ఫీట్‌ రోడ్‌

● హోటల్‌ గ్రాండ్‌, రామ్‌లక్ష్మణ్‌ జంక్షన్‌

అన్నీ మాంసాహారులకేనా శాకాహారుల ఆకలి కూడా తీరుస్తానంటోందీ ఈ బలవర్ధక ఆహారం. కూరగాయలన్నింటిని కలిపి దమ్‌లో వేసి ఉడికిస్తే ఆల్‌మిజ్‌ మిక్స్‌ బిర్యానీ సిద్ధం.

హాట్‌ ఫేవరెట్‌ ప్లేస్‌

● హోటల్‌ దక్షిణ్‌, సింహద్వారం సమీపంలో.. ● బిర్యానీస్‌

● మామిడికాయ చికెన్‌ బిర్యానీ, చింతచిగురు మటన్‌, చికెన్‌ బిర్యానీలు, గోంగూర చికెన్‌, మటన్‌ బిర్యానీలు సీజన్‌ బట్టీ తయారు చేస్తున్నారు.

● శుభకార్యాల్లో పనస బిర్యానీని వడ్డించడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారింది.

రోజూ బిర్యానీ తయారీకి

వినియోగించే బాస్మతీ బియ్యం

1000కేజీలు

ఆది,

మంగళవారం 7000

బిర్యానీ మాస్టర్‌ నెల జీతం

రూ.25,000 నుంచి

రూ. 60,000 వరకు

(హోటల్‌ స్థాయిని బట్టీ)

జిల్లా వ్యాప్తంగా

నెలలో బిర్యానీ అమ్మకాలు

అంకెల్లో బిర్యానీ

(సుమారు)

పరమ పవిత్ర క్షేత్రం.. వేల ఏళ్ల నాటి శిల్పాలు.. అనాదిగా పూజలందుకుంటున్న కూర్మనాథుని విగ్రహ రూపం.. శ్రీకూర్మ శ్రీక్షేత్రంలో వీటితో పాటు మరో ‘స్టార్‌’ అట్రాక్షన్‌ ఉంది. అవే నక్షత్ర తాబేళ్లు. శ్రీకూర్మనాథుని మూలవిరాట్‌ తాబేలు రూపంలో ఉండటంతో ఈ ఆలయంలో నక్షత్ర తాబేళ్ల పెంపకం ఎప్పటి నుంచో ఉంది. వన్యప్రాణి ప్రేమికులు గతంలో కో ర్టును ఆశ్రయించగా, భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఆలయంలో తాబేళ్లను ఉంచ వచ్చని, అయితే నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యే క గదితో పాటు సంరక్షణ ఉండేలా దేవదాయ శాఖ చర్యలు చేపట్టాలని సూచించడంతో ఇక్కడ తాబేళ్లను పెంచుతున్నారు.

–గార

కహానీ

నేడు వరల్డ్‌ బిర్యానీ డే

సిక్కోలులో అత్యధికంగా విక్రయించే వంటకం బిర్యానీ

ఈ బిర్యానీ కోసం ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్‌ నుంచి సిక్కోలుకు చేరింది ఈ వంటకం. పొగలు కక్కే బిర్యానీని ఆరగిస్తుంటే చెమటలు కక్కాల్సిందే. చక్క గా ఉడికి నోటిలోకి చేరగానే కరిగిపోయేలా ఉండే ఈ బిర్యానీ నగరవాసుల స్పెషల్‌ చాయిస్‌. ఇందులో చికెన్‌ మటన్‌ రుచిలో దేనికవే ప్రత్యేకం.

హాట్‌ఫేవరెట్‌ ప్లేస్‌

● మినర్వా, డే అండ్‌ నైట్‌ జంక్షన్‌

● జేఎంఆర్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా

ఉడుకుతున్న బియ్యాన్ని మసాలా మచ్చిక

చేసుకుంటే.. ఆ మిశ్రమంతో మాంసం చుట్టరికం కలిపితే.. ఇక జిహ్వపై విస్ఫోటనమే. ఆ నేస్తరికం

మాంసంతోనే కాదు.. పన్నీరు నుంచి పుట్టగొడుగు వరకు ఏది కలిపినా రుచి మహత్తరమే. అదీ బిర్యానీ గొప్పదనం. పర్షియా లోని రాజుల వంటశాల నుంచి మన కంచం వరకు బిర్యానీ కహానీ చాలా గొప్పది. విందు ఏదైనా పళ్లెంలో బిర్యానీ లేకపోతే వెలితి. పార్టీ ఎవరిదైనా బిర్యానీ కనిపించకుంటే నోటికి లేదు రుచి.

– శ్రీకాకుళం, శ్రీకాకుళం కల్చరల్‌, శ్రీకాకుళం పీఎన్‌ కాలనీ

నాతో కూడా బిర్యానీ వండి వార్చవచ్చంటున్నాయి జలపుష్పాలు. బోన్‌లెస్‌ ఫిష్‌తో బ్రహ్మాండమైన బిర్యానీని నగరంలోని వివిధ హోటళ్లు వడ్డిస్తున్నాయి. బాషా అనే సముద్రం రకం చేపను వినియోగిస్తున్నారు.

హాట్‌ ఫేవరెట్‌ ప్లేస్‌

జీషాన్‌, రామ్‌లక్ష్మణ్‌ జంక్షన్‌

● నగరంలో రూ.100 నుంచి రూ.150 వరకు ధరల్లో వివిధ ప్రాంతాల్లో బిర్యానీలను విక్రయిస్తున్నారు. సామాన్యులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సేల్‌ పాయింట్స్‌:

పాలకొండ రోడ్‌, చిన్నబజార్‌ రోడ్‌, సెవెన్‌ రోడ్‌ జంక్షన్‌, డీఎస్పీ ఆఫీస్‌ సమీపంలో, రైతు బజార్‌ సమీపంలో..

రోజువారీ

అమ్మకాలు

11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement