బుర్రకథలంటే ఆరోజుల్లో ఎంతో ఆదరణ ఉంది. మేము ప్రదర్శనకు వస్తే గ్రామాల్లో ఎంతో ఆదరించేవారు. నా పదహారో ఏట నేను మొదటి సారిగా స్టేజి ఎక్కి ప్రదర్శన చేశాను. నేను వచనంతో పాటు గా సెంటర్ కథ కూడా చెప్పేదాన్ని. 1500 వరకు ప్రదర్శనలు చేశాను. మా పేద పరిస్థితిని బట్టి నేను ఒక పక్క చదువుతూ మరో ప్రక్క ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. దానిద్వారా వచ్చిన డబ్బుతో ఫీజులు, పుస్తకాలు కొనుక్కొని చదివాను. ప్రముఖ కళాకారిణి గరివిడి లక్ష్మి గ్రూపు తో సమానంగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. గ్రామాల్లో నోట్ల దండలతో మమ్మల్ని సత్కరించేవారు. గరివిడి లక్ష్మి సినిమాగా రావడం గర్వంగా ఉంది. నేడు బుర్రకథల ప్రదర్శనలలో ఆశ్లీలత కనిపిస్తోంది. ట్రూపులో ఎంత మంది యువతులు ఉన్నారో అడిగి ప్రదర్శన బుక్ చేస్తున్నారు. ఇది తగదు.
– అలిగి రమాదేవి, బుర్రకథ కళాకారిణి, శ్రీకాకుళం
ప్రాచీన జానపద కళారూపమైన బురక్రథకు మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేస్తున్న గరివిడి లక్ష్మి చిత్రం విజయ వంతం కావాలి. ఒక్క బురక్రథ కాదు జముకుల పాట, పందిరి పాట, తూర్పు భాగవతం, పులి వేషధారణలు, వీరణం, బిందెల నృత్యాలు ఇవన్నీ కూ డా మన ప్రాచీన కళారూపాలే. వీటిని కాపాడాలి. – వి.జగన్నాథంనాయుడు, ఇంటాక్ అదనపు కన్వీనర్


