సంతబొమ్మాళి: దేశ సరిహద్దుల్లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నా.. సొంతూరులో న్యాయం కోసం పోరాడాల్సి వ స్తోందని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జవాన్ దీర్ఘాశి చిట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మూలపేట పోర్టు నిర్మాణానికి సానుకూలంగా స్పందించి గ్రామాన్ని, భూములను త్యాగం చేసిన తమకు పరిహారం విషయంలో అన్యాయం చేశారంటూ జమ్మూ కశ్మీర్ నుంచి వీడియో ద్వారా సోమవారం తన అవేదన వ్యక్తం చేశారు. రూ.50లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించినప్పటికీ పోర్టు యాజమాన్యం, అధికారులు కేవ లం రూ. 25లక్షలకే ఎస్టిమేషన్ వేశారని చిట్టయ్య తెలిపారు. దీనిపై న్యాయం చేయా లని కోరుతూ రీ ఎస్టిమేషన్ వేయాలని కలెక్టర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమ సుందర్‌రావుకు వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు. వినతి పత్రం ఇచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మూలపేట గ్రామానికి, తమ ఇంటికి వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారని చిట్టయ్య తెలి పారు. ఎందుకని ప్రశ్నిస్తే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి నిలిపివేయాలని చెప్పినట్లు సమాధానం ఇచ్చారని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం ఇంత త్యాగం చేసిన తమకు కనీసం న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. అన్యాయాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంపినట్లు జవాన్ చిట్టయ్య తెలిపారు.
16 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బీహార్‌కి అక్రమంగా 16 కిలోల గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్ అలియాస్ మోహిత్ జైస్వాల్, ఒడిశాకు చెందిన సూర్యనారాయణ గౌడ అలియాస్ సిల్లుగౌడ అనే ఇద్దరు వ్యక్తులు పట్టణ పోలీసులకు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో సో మవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్ ఆర్థిక పరిస్థితి బాగులేక డబ్బులు సంపాదన కోసం బీహార్‌లో గంజాయి వ్యాపారం చేసే అమిత్‌ని కలిశాడు. అమిత్ ఒడిశా నుంచి గంజాయిని తీసుకు రావడంలో తనకి సహకరిస్తే రూ.పదివేలు ఇస్తానన్నాడు. దీనికి అంగీకరించిన సునీల్ అమిత్‌తో కలసి ఒడిశాలో లక్ష్మికాంత్ గౌడ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి చాలా సార్లు బీహార్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో మళ్లీ 16 కిలోల గంజాయిని కొనుగోలు చేసి సూర్యనారాయణ గౌడతో కలిసి బైక్‌పై బరంపురం రాగా.. అక్కడ పోలీసు తనిఖీలు ఉండడంతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు వ చ్చారు. ఇక్కడ పోలీసుల తనిఖీలో ఇద్దరూ దొరికిపోయారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇరువురి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
100 బస్తాల యూరియా పట్టివేత
జలుమూరు: మండల పరిధి చల్లవానిపేట, గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 100 బస్తాలు యూరియా, ఐదు టన్నుల బియ్యంను సోమవారం సీజ్ చేశారు. చల్లవానిపేట వద్ద తనిఖీలు చేయగా ఒడిశా రాష్ట్రం పర్లాఖిముడి నుంచి వ్యాన్‌తో పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన డోల రమణ మూర్తి 4.5 మెట్రిక్ టన్నుల యూరియా తరలిస్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి 100 బస్తాలు యూరియా గుర్తించామని విజిలెన్స్ అధికారి రామారావు తెలిపారు. ఎలాంటి ప త్రాలు లేనందున యూరియాను చల్లవానిపేట పీఏసీఎస్‌లో భద్రపరిచి వాహనాన్ని జలుమూ రు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు.
గుగ్గిలిలో రేషన్ బియ్యం పట్టివేత
గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన కోరాడ గోవిందరావు ఆటోలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. పరిసర గ్రామాల్లోని రే షన్ కార్డు దారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి పర్లాఖిముండి తరలిస్తున్నట్లు తెలిపారు.


