మిగులు భూములు పేదలకు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మిగులు భూములు పేదలకు ఇవ్వాలి

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

మిగులు భూములు పేదలకు ఇవ్వాలి

బూర్జ మండలం అయ్యవారిపేట(టీడీఆర్‌ రాజుపేట)లో ప్రభుత్వ మిగులు భూములు తరతరాలుగా దళితులు, బీసీలు, వెనుకబడిన పేదలు సాగు చేసుకుంటున్నారని, ఆ భూమిలో పేద బీసీ, ఎస్సీ రైతులకు పట్టాల మంజూరు చేయాలని జిల్లా పరిషత్‌ వద్ద సాగుదారులతో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, కుప్పిలి శ్రీధర్‌, సింహాచలం, విష్ణుమూర్తి, ఎస్‌.జనార్ధన, రామచంద్రరావు, కుప్పేశ్వరరావు, ఆదిలక్ష్మి, సరస్వతి, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement