ఇలా ఇచ్చారు.. అలా విరిగింది..! | - | Sakshi
Sakshi News home page

ఇలా ఇచ్చారు.. అలా విరిగింది..!

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

దివ్యాంగులకు నాసిరకం ట్రైసైకిళ్లు

● కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చేతులు మీదుగా ఆదివారం పంపిణీ

● పంపిణీ చేసిన రోజే విరిగిన ఓ దివ్యాంగుడి ట్రైసైకిల్‌

● ఆ దివ్యాంగుడికి తప్పిన ప్రమాదం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చేతుల మీదుగా తీసుకున్న ట్రైసైకిల్‌ ఎక్కిన దివ్యాంగుడికి ప్రమాదం తప్పింది. పంపిణీ చేసిన రోజునే ఈ ట్రైసైకిల్‌ విరిగిపోయింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.కోటిన్నర సీఎస్‌ఆర్‌ నిధులతో తయారు చేసిన ట్రైసైకిళ్లలో నాణ్యత లోపాలున్నాయా? వీటి వెనక చేతివాటం ప్రదర్శించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 130 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, 100 మంది వయో వృద్ధులకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ నిధుల సాయంతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చేతులమీదుగా ఆదివారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పుడా ట్రైసైకిళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.

జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన ఢిల్లీరాజు అనే దివ్యాంగుడికి ఆదివారం కేంద్రమంత్రి అందజేసిన ట్రైసైకిల్‌ ఇంటికి తెచ్చిన రోజే విరిగిపోయింది. ఇంట్లో అలా కూర్చోగానే ఒక చక్రం విరిగిపోయింది. ఇంట్లో జరగడం వల్ల ప్రమాదం తప్పింది. దాని చార్జర్‌ కూడా పనిచేయడం లేదు. దివ్యాంగులకు ఎంతో నాణ్యమైన పరికరాలు అందజేయాలి. నాణ్యతా ప్రమాణాలను పక్కాగా చూసుకుని, అన్నీ పరిశీలించాక పంపిణీ చేయాలి. నిర్మాణ కంపెనీ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, పంపిణీ చేసిన రోజునే ఆ ట్రైసైకిల్‌ విరిగిపోయిందంటే ఎక్కడో లోపాలు ఉన్నాయన్నది విచారణ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ఆలోచిస్తేనే భయమేసింది

నాసిరకం ట్రైసైకిళ్లతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచిస్తే భయంగా ఉంది. ఇంటి ఆవరణలో జరిగింది కాబట్టి సరిపోయింది. రోడ్డు మీద, ఇంకెక్కడైనా జరిగితే ప్రమాదకరం. దయచేసి మున్ముందు జరక్కుండా, సరిచేసి లేదా కొత్తది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. – ఢిల్లీరాజు,

దివ్యాంగుడు, చల్లవానిపేట, జలుమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement