వి.. న.. తి.. | - | Sakshi
Sakshi News home page

వి.. న.. తి..

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

క్యూర్‌ కోడ్‌ స్కాన్‌తో ఫిర్యాదు చేయవచ్చు

జిరాయితీని గ్రామ కంఠంలో కలిపేశారు

కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

● పీజీఆర్‌ఎస్‌లో పరిష్కారమవ్వని సమస్యలు ● పలుమార్లు వచ్చినా పరిష్కారం కాని వినతులు ● ఎండార్స్‌మెంట్‌తో సరిపెడుతున్న వైనం

తాగునీటి బావిని కప్పేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అలా ఆయన ఫిర్యాదు చేయడం ఇది మూడోసారి. రెగ్యులరైజేషన్‌ కోసం కాంట్రాక్టు ఉద్యోగులు వినతులిచ్చారు. అలా విన్నవించడం ఇదేమీ మొదటి సారి కాదు. పీజీఆర్‌ఎస్‌లో వినతులు ఎక్కువ.. పరిష్కారాలు తక్కువలా పరిస్థితి మారిపోయింది. ఫిర్యాదుదారులు సమస్యలతో విసుగెత్తిపోతున్నా, పరిష్కారం దొరక్క నరకయాతన పడుతున్నా.. అధికారులు మాత్రం స్పందించకుండా తిప్పలు పెడుతున్నారు. ఈ వారమూ అదే పరిస్థితి కనిపించింది. క్షేత్రస్థాయిలో అధికారులు దృష్టి పెట్టకపోవడంతో రెవెన్యూ క్లినిక్‌ సైతం నిస్సారంగా మారుతోంది.

సుగెత్తిపోతున్నా..

రక యాతన పడుతున్నా..

ప్పలు పెట్టే వేదిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పేరుకే ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమవుతున్న పరిస్థితి లేదు. దీంతో వచ్చిన వినతులే మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మరోసారి నమోదుకు కూడా అవకాశం కల్పించడం లేదు. దీంతో సమస్యల పరిష్కారం కాకపోవడం, పదేపదే అదే సమస్యలను పీజీఆర్‌ఎస్‌ దృష్టికి బాధితులు తీసుకురావడం జరుగుతోంది. అధికారులు లెక్కల్లో మాత్రం పరిష్కారం చూపుతున్నారు. అంతా ఎండార్స్‌మెంట్‌తోనే సరిపెడుతున్నారు. ఒక్కోసారి పీజీఆర్‌ఎస్‌లో కిందిస్థాయి అధికారులపై కేకల వేయడం, తర్వాత ఆ సమస్యను పూర్తిగా మర్చిపోవడం జరుగుతోంది. ఇలా ప్రతివారం పీజీఆర్‌ఎస్‌లో రిపీట్‌గా కొనసాగుతోంది. మరోవైపు రెవెన్యూ క్లినిక్‌లు పెడుతుండగా.. అన్ని వినతులు మండల స్థాయలో పరిష్కారం కావాల్సినవే వస్తున్నాయి. అంటే క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులు దృష్టి పెట్డకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పీజీఆర్‌ఎస్‌కు 89,497 వినతులు వచ్చాయి. వీటిలో 85,923 సమస్యలు పరిష్కరం జరిగిట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇంకా పెండింగ్‌లో 3,574 ఉన్నాయని చెబుతున్నారు. కానీ వాస్తవానికి పరిష్కారం అంటే ఎండార్స్‌మెంట్‌ ఇవ్వడంతోనే సరిపెడుతుండడం గమనార్హం.

● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని, దీనివలన మరింత మెరుగైన సేవలు పొందగలుగుతారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.

అర్జీదారులు తమ అర్జీలను నేరుగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో గానీ, లేదా ఆన్‌లైన్‌ ద్వారా మీకోసం వెబ్‌సైట్‌లో గానీ నమోదు చేసుకోవచ్చని సూచించారు. నమోదైన అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. కాగా ఈ వారం మొత్తం 253 వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సీసీఎల్‌ఏ శాఖకు సంబంధించి 133 అర్జీలు, పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో 16, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 14, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌కు 12, జలవనరుల శాఖకు 8, సర్వే సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంకు 8, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుకు 6, సెర్ప్‌ విభాగంలో 6, కుటుంబ సంక్షేమ శాఖకు 5, టిడ్కోకు 5 అర్జీలు వచ్చాయి. అలాగే సమగ్ర శిక్షకు 4, హౌసింగ్‌ కార్పొరేషన్‌కు 4, ఈపీడీసీఎల్‌కు 4, వైద్య విద్యకు 3, దేవదాయ శాఖకు 3, ఆర్‌అండ్‌బీకు 2, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌కు 2, స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు 2 వినతులు వచ్చాయి. అదేవిధంగా పశుసంవర్ధక, ఏపీఎస్‌ఆర్‌టీసీ, పాఠశాల విద్య, పోలీసు శాఖ, మత్స్యశాఖ, అటవీ శాఖ, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌, రవాణా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఫ్యాక్టరీలు, ఏపీఐఐసీ, సివిల్‌ సప్లయ్‌, ఉద్యానవన, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, జెడ్పీ సీఈవో సీఈవో వెంకట్‌ రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

● వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌ రెడ్డి పలు సమస్యలపై వినతిపత్రం అందించారు.

శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న తాగునీటి బావిని రాత్రికి రాత్రి జేసీబీ, ట్రాక్టర్లతో కప్పేసి ప్రభుత్వం స్థలంలో మొక్కలు వేశారని గ్రామ మహిళలు, పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గత వారం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బగాది మనోజ్‌ కుమార్‌, పేడాడ రామారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామ రెవెన్యూ పరిధిలో జిరాయితీ భూములను సర్వే అధికారులు గ్రామ కంఠలో చూపించారని, సర్వే సమయంలో కనీసం నోటీసుల కూడా ఇవ్వలేదని ఆ గ్రామానికి చెందిన రైతు కంచరాన గోపి ఫిర్యాదు చేశారు. అంతా ఇష్టారాజ్యంగా వీఆర్వో, సర్వేయర్లు వ్యవహరించి రైతుకు భూమిపై హక్కుల లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తమతో పాటు పలువురు రైతులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేస్తే ఎండార్స్‌మెంట్‌ ఇస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ – హెల్త్‌ కాంట్రాక్ట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ వద్ద ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాష్ట్రంలో సుమారు 14,600 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఇతర వైద్యశాఖ సిబ్బంది ఉన్నారు. తమను రెగ్యూలర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు కె.వేదవతీ లక్ష్మీబాయి, పి.రఽఘు, ఎస్‌.రమేష్‌, బి.సంతోష్‌ కుమార్‌, ఎం.గోవిందరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement