శ్రీకాకుళం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భాగంగా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రజల నుంచి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందే ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
వినతులు పరిశీలిస్తే..
● తమపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన రాకోటి సురేష్, తలసముద్రం వసంతరావు, రాకోటి రాకేష్, రాకోటి ఈశ్వరరావులు కోరారు.
● కంచిలి మండలం కేబీనౌగాం గ్రామంలో సర్వే నంబర్ 88/1లో సుమారు 60 సెంట్ల భూమికి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్నందును తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రోము ప్రధానో విన్నవించారు.


