వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

పోలాకి: మండలంలోని గాతలవలస గ్రామానికి చెందిన టీడీపీ యువ కార్యకర్త కొమ్మల వేణు సోమవారం వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం దళితులు, మైనార్టీలపై చూపుతున్న వివక్ష, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. ఎప్పటినుంచో టీడీపీకి సపోర్టు చేస్తున్నా గాతలవలస పంచాయతీలో వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రాయల మల్లేసు, బొడ్డేపల్లి హరికృష్ణ, మెండ ధర్మారావు, దండుపాటి సూర్యనారాయణ వంటి పార్టీ సీనియర్‌లతో కలిసి పంచాయతీలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అందవరపు సూరిబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement