రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

టెక్కలి రూరల్‌: మండలంలోని అక్కవరం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలతో పాటు రెండేళ్ల బిడ్డకు గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న వై.సుప్రియ తన రెండేళ్ల బిడ్డను పట్టుకుని తన భర్త విష్ణుతో కలసి ద్విచక్రవాహనం పై చాకిపల్లి గ్రామం నుంచి టెక్కలి వైపు వస్తున్న క్రమంలో అక్కవరం వద్ద గుర్తు తెలియని కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారికి, విష్ణుకి స్వల్పగాయాలు కాగా సుప్రియకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement