ఇవేం పనులు! | - | Sakshi
Sakshi News home page

ఇవేం పనులు!

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

జలుమూరు: ఉపాధి హామీ పథకం కొంతమంది కూటమి నాయకులు కాసులు కురిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలోని పలుచోట్ల చెరువుల్లో పూడిక తీత, అంగన్‌వాడీ కేంద్రాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, పాఠశాలల వద్ద పిచ్చిమొక్కలు తొలగించడం, పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేయించడం వంటివి ఉపాధి వేతనదారులతో చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వేసవిలో చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయిస్తున్నారు. పని ఓ చోట చేసి వేతనదారులకు వారి అనుకూలమైన ప్రదేశం వద్ద ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. గతంలో చేసిన పనులే అయినప్పటికీ వేతనదారులతో ఎక్కువ పనులు చేయించినట్లు చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన నేషనల్‌ మస్టర్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎమ్‌ఎస్‌) యాప్‌లో వీటి ని పొందుపరుస్తున్నారు. వాస్తవంగా ఈ పనుల వల్ల కనీసం ప్రయోజనం లేదని మండలాధికారులకు తెలిసినా ఉన్నతాధికారులు ఒత్తిడితో చేయి స్తున్నారని సమాచారం. శ్రీకాకుళం రూరల్‌, పోలాకి, నరసన్నపేట, జలుమూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస, సారవకోట, గార తదితర మండలాల్లో ఈ తరహా పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా వంశధార కాలువలు అధికంగా ఉన్న చోట ఈ పనులు జరిపిస్తున్నారు.

టీడీపీ నాయకులకు వరం..

ప్రస్తుతం జరుగుతున్న పనులు స్థానిక టీడీపీ నాయకులకు వరంలా మారాయి. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రత్యేక అధికారులు పాలన వచ్చింది. ఇదే సందర్భంలో ఆయా పంచాయతీలలో ప్రస్తుతం జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను వేతనదారులతోనే తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఉన్నా పనులు ఉపాధి వేతనదారులతో చేయించి ఆ నిధులు మాత్రం ప్రత్యేక అధికారుల మీద టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉపాధి వేతనదారులతో పూడికలు, చెత్తాచెదారాల తొలగింపు పనులు

పని ఒకచోట.. ఫొటో అప్‌లోడింగ్‌ మరోచోట

కూటమి నాయకులకు కాసులు కురిపిస్తున్న ఉపాధి పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement