రైతన్నల శ్రమదానం | - | Sakshi
Sakshi News home page

రైతన్నల శ్రమదానం

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధి బెల్లుప డ గ్రామానికి చెందిన 1050 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులంతా కలసి శ్రమదానంతో కాలువను బాగుచేసుకున్నారు. గాయకట్టు బాహుదా చానెల్‌లో పేరుకుపోయిన చెత్త, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలను తొలగించి పంటపొలాలకు నది నుంచి నీటిని మళ్లించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే శ్రమదానం చేశామని రైతులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని సింగుపురం పంచాయతీ పెద్దవీధిలో నివాసం ఉంటున్న ముద్దాడ వెంకటలక్ష్మి (35) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు.. వెంకటలక్ష్మి మొదటి భర్త కరోనా సమయంలో మృతి చెందడంతో 2025లో పాతపట్నంకు చెందిన సన్యాసిరావుతో రెండో వివాహం జరిగింది. వివాహం అయిన నాటి నుంచి వీరు పాతపట్నంలోనే కాపురం పెట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరు తగాదాలు పడడం, పెద్దల సమక్షంలో రాజీ పడడం జరిగేది. రెండు రోజులుగా గొడవలు ముదరడంతో ఆదివారం వెంకటలక్ష్మి తల్లి పాతపట్నం వెళ్లి తన కూతురిని స్వస్థలానికి తీసుకొచ్చింది.

దీంతో మనస్తాపం చెందిన వెంకటలక్ష్మి ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఎర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement