టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి..

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

ఆమదాలవలస: బూర్జ మండలం చీడివలస గ్రా మానికి చెందిన 15 కుటుంబాలు ఆదివారం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. పార్టీలోకి చేరిన వారిని నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ కండువాలు కప్పి సత్కరించారు. పార్టీలో చేరిన వారిలో చీడివలసకు చెందిన పండూరి సూర య్య, దాసరి రమేష్‌, దాసరి సాయిదుర్గ, ముచ్చు యుగేందర్‌, పొన్నూరు అప్పారావు, తమ్మిన రామినాయుడు, చిన్ని శివ, దాసరి రెయ్యన్న తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, జెడ్పీటీసి బెజ్జిపురపు రామారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వావిలపల్లి మురళీ, ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ దుంపల శ్యామలరావు, అతులూరి రవికాంత్‌, అల్లంశెట్టి గిరి, గొలివి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement