నరసన్నపేట: సుందరాపురంలో చాలా కాలంగా టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక ఆహా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా తిర్రి శ్రీనివాసరావు, ఉర్జాన గోపి, తలసముద్రం రామారావు, దండుపాటి సింహాచలంలు తమ కుటుంబాలతో సహా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధర్మాన కృష్ణచైతన్యలు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వనించారు.
కార్యక్రమంలో సుందరాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు సడగాన రవి, సడగాన సింహాచలం, పంగ నాగభూషనరావు, ముద్దాడ గణపతి తదితరులు పాల్గొన్నారు.


