మూగజీవాల పెంపకంపై పెరిగిన ఆసక్తి
వ్యాధులపై అప్రమత్తత అవసరం
జాగ్రత్తగా పెంచుకోవాలి
ఒక మొబైల్ సరిగ్గా చూపుడు వేలంత ఉంటుంది..
మరో సెల్‌ఫోన్ చేతిలో ఇమిడిపోయే అద్దం సైజులో
ఉంటుంది.. ఇంకో చరవాణి స్మార్టే అయినా
షార్ట్ అండ్ స్వీట్‌గా ముచ్చట గొలుపుతుంది. ఐ ఫోన్ నుంచి
ఆండ్రాయిడ్ ఫోన్ల యుగంలో ఈ బుల్లి మొబైళ్లు కూడా
మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. చూసేందుకు బొమ్మల్లాగానే ఉన్నా.. సాధారణ సెల్‌ఫోన్లలాగానే పనిచేస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
అందంగా అలంకరించిన శునకం
మహా భారతమంతా ముగిసి పాండవుల మహాప్రస్థాన యాత్ర మొదలయ్యాక అన్నీ కోల్పోయిన ధర్మరాజు వెంట నడిచింది ఒక్క శునకం. పురుషోత్తముడిగా పేరున్నా.. అయోధ్యకు రారాజైనా సీత జాడ రాముడికి తెలియజెప్పింది జటాయువు. కలియుగ దైవమని కీర్తి ఉన్నా.. మహావిష్ణువు అవతారమే అయినా ఏడుకొండల వాడి ఆకలి తీర్చింది గోమాత. విశ్వ విజేతగా పేరున్నా అలగ్జాండర్ మనసు గెలుచుకున్నది బుసీఫాలెస్ అనే గుర్రం. మానవ జాతితో మూగజీవాల అనుబంధం అనాది కాలంగా వస్తోంది. ఇంత సాంకేతికత పెరిగినా ఇప్పటికీ పెంపుడు జంతువులతో నేస్తరికం పెరిగిందే తప్ప తరగలేదు. ఇంటిలో తిరిగే శునకం, పెరట ముద్దుగా కూసే చిలక, ఇల్లంతా తిరిగే మార్జాలం.. జీవితానికో పరిపూర్ణత తీసుకువస్తున్నాయి. నేడు వరల్డ్ యానిమల్ డే.
– శ్రీకాకుళం కల్చరల్
మనకు ముప్పొద్దులూ ముప్పై రకాల తిండి వస్తువులు కనిపిస్తూ నోరూరిస్తుంటాయి. మరి మూగజీవాలకో. వాటికీ న్యూట్రిషన్ ఫుడ్ అవసరమని వెటర్నరీ వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెంపు డు జంతువుల కోసం శాకాహార, మాంసాహార వంటలను 3,4 విదేశీ కంపెనీలు, 5,6 స్వదేశీ కంపెనీ లు మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చాయి.కు క్కలు, పిల్లులు, పక్షులు వీటిని తిని సులువుగా జీర్ణించుకొనేలా సిద్ధం చేశారు. వీటిని చికెన్, మటన్, కూరగాయల మిశ్రమాలతో చేస్తున్నారు.
మనకే కాదు పెంపుడు జంతువుల సింగారానికీ వస్తువులున్నాయి. రకరకాల మెడపట్టీలు, దుస్తులు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి వచ్చాయి.
నెక్ కాలర్ : జంతువుల మెడకు కట్టే పట్టీ. ఇది రకరకాల రంగులు, డిజైన్లలో లభిస్తుంది.
లీష్ బెల్ట్ : పెంపుడు జంతువులను బయటకు నడిపించడానికి మెడ పట్టీకి తగిలించే తాడు.
హార్నెస్: కేవలం మెడకే కాకుండా ఛాతీ భాగం చుట్టూ అమర్చే పట్టీ. ఇది జంతువులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
పెట్ టీషర్టులు–కోట్లు : చలికాలంలో వేడి కోసం, అలాగే అందం కోసం వేసే చిన్న రంగుల దుస్తులు.
బో టై–బంధనాలు: పెంపుడు జంతువుల మెడకు కట్టే రంగురంగుల స్కార్ఫ్‌లు లేదా బో టైలు, ఇవి వాటికి పండగ లుక్‌ని ఇస్తాయి.
కుక్కలను పెంచుకునేవారు ఇతర ప్రాంతాలకు గానీ, క్యాంపులకు గానీ వెళ్తే తమ కుక్కల గురించే ఆలోచిస్తుంటారు. అందుకే జిల్లా కేంద్రంలో డాగ్ కేర్ సెంటర్ తెరిచారు. తాత్కాలికంగా వారి వద్ద ఉంచుకోడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కుక్క జాతిని బట్టి రోజుకు రూ.300, రూ.400లు వసూ లు చేస్తున్నారు. ఇందుకోసం వారు చిన్న చిన్న గదులను ఏర్పాటు చేశారు. కావాల్సిన వారు 7396859118 (సతీష్)కు సంప్రదించాలి.
మూగజీవాలపై ఎంత ప్రేమ ఉన్నా.. వ్యాధుల విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవడం శ్రేయస్కరం. కుక్కలు, పిల్లులు, కుందేళ్ల నుంచి మానవులకు ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. సకాలంలో టీకాలు వేయడమే ఇందుకు పరిష్కారం. కుక్కకు రెండునెలల వయసులోనే రాబిస్ యాంటీ వ్యాక్సిన్ వేయించాలి. ఏడాదికి రెండు సార్లు వ్యాక్సిన్ వేయించాలి. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తోంది. ఇంటి కుక్కను బయట కుక్కలు కరిస్తే 24 గంటల్లో వ్యాక్సిన్ వేయించాలి.
కుక్కల నుంచి రేబిస్, లీష్మినియా, బద్దెపురుగుల వ్యాధి, మీసిల్స్, మంప్స్, హైడాటిడోసిస్, రింగ్‌వార్మ్, మెంజ్ వ్యాధులు వస్తాయి. పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిన్, లిస్టిరియోసిస్, రింగ్ వార్ము, మేకల నుంచి ఆంత్రాక్సు, బ్రూసిల్లోసిన్, లిస్టిరియోసిస్, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, మెంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి.
పెంపుడు జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటిని దూరంగా ఉంచాలి. మంచాల మీదకు ఎక్కించుకోవడం, ముద్దులాడడం వంటివి చేయ కూడదు. ఎందుకంటే వాటి వల్ల మనకు తెలియని జబ్బులు వస్తాయి. మనుషులలో 70 శాతం కొత్త జబ్బులు జంతువుల వల్లనే వస్తున్నాయి.
– డాక్టర్ ఆర్.హేమంత్‌కుమార్,
డాక్టర్ డాగ్ యానిమల్ ఆస్పత్రి, శ్రీకాకుళం


