ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

ప్రయోజనం

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

ప్రయోజనం ●రైలులో బైక్‌ పంపించాలా..?

ఆమదాలవలస: సుదూర ప్రాంతాలకు ఇళ్లు మారినప్పుడు బైక్‌లను తీసుకెళ్లడం ఓ ప్రహసనం. రైల్వే పార్సిల్‌ సర్వీసుతో బైక్‌లను సులభంగా ఆయా ప్రాంతాలకు తరలించుకోవచ్చు.

ఏ పత్రాలు అవసరం..

●బైక్‌ సీబుక్‌ తప్పనిసరి.

●బైక్‌ సీబుక్‌ ఎవరి పేరుమీద ఉంటే వారి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ ఉండాలి.

●బైక్‌ బుక్‌ చేసే వారే వారు బుక్‌ చేసే ప్రాంతం నుంచి డెలివరీ తీసుకుంటే వారి ఆధార్‌ కార్డు సరిపోతుంది. లేదంటే అక్కడ వేరే వ్యక్తులు బైక్‌ను డెలివరీ తీసుకుంటారంటే వారి ఆధార్‌ కార్డు అడ్రస్‌ ప్రూఫ్‌ తప్పనిసరిగా ఉండాలి.

●బైక్‌ పార్సిల్‌ చేసుకునే రోజే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారి టికెట్‌ ఉండాలి.

●ఒక వేళ ఎవరూ ఆ బైక్‌తో ప్రయాణించకపోతే ఏ స్టేషన్‌కు బైక్‌పార్సిల్‌ చేశారో ఆ స్టేషన్‌కు జనరల్‌ టికెట్‌ తీసుకొని బైక్‌తోపాటు ఇవ్వాలి.

●బుక్‌ చేసుకున్న వారి బైక్‌ ఆ ప్రాంతంలో దిగిన తర్వాత 6 గంటలలోపు డెలివరీ తీసుకోవాలి. లేదంటే అదనపు చార్జీలు తప్పవు.

రేట్లు ఇలా..

●బైక్‌ పార్సిల్‌ ప్యాకింగ్‌ చార్జీ కింద రూ.305లు వసూలు చేస్తారు.

●దూరాన్ని బట్టి చార్జీలు మారుతుంటాయి. ఉదాహరణకు శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతికి బైక్‌ పార్సిల్‌ చేయిస్తే సుమారుగా రూ.1500 పార్సిల్‌ కౌంటర్‌లో చెల్లించాలి. అంటే తిరుపతికి పార్సిల్‌ చార్జీ రూ.1805.

బుకింగ్‌ ఎక్కడ:

బుకింగ్‌ ప్రక్రియ శ్రీకాకుళంరోడ్‌(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో అయితే చీఫ్‌ బుకింగ్‌ సూపర్‌ వైజర్‌ (సీబీఎస్‌ఆర్‌) శివశంకర్‌, చీఫ్‌పార్సిల్‌ సూపర్‌ వైజర్‌ (సీపీఎస్‌ఆర్‌) పీవీజీ రెడ్డిల ఆధ్వర్యంలో జరుగుతాయి.

మరిన్ని వివరాల కోసం

08912885932 సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement