లావేరు: గురుగుబిల్లిలో టీడీపీ, బీజేపీలకు చెందిన 20 కుటుంబాల వారు శనివారం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ చేరిన వారిలో తోలాపి అసిరయ్య, నేతల రాము, గరికివాడు, గుర్రాల ఉత్తరతో పాటు 20 కుటుంబాల వారు ఉన్నారు. వీరందరికీ గొర్లె కిరణ్ కుమార్ వైఎస్సార్ సీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పేదల పాలిట వరంలా పని చేసే జగనన్న పార్టీ అంటే తమకెంతో ఇష్టమని చెప్పారు. గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గురుగుబిల్లి వైఎస్సార్ సీపీ నాయకులు బాడిత వెంకటేశ్వరరావు (దొరబాబు), బాడిత రాంబాబు, నేతల చిన్నారావు, ఇలకల అప్పలగురువులు తదితరులు పాల్గొన్నారు.


