వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై దాడి

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

సారవకోట: మండలంలోని అలుదు పంచాయతీ మాకివలస గ్రామానికి చెందిన రావాడ శ్రీనివాసరావు పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. మాజీ ఎంపీటీసీ పంచిరెడ్డి జ్ఞానేశ్వరిపై దౌర్జన్యం చేసి ఆమె భర్త శ్రీనివాసరావుపై ఆ గ్రామానికి చెందిన చల్ల ముకుందరావుతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం దాడి చేయగా వెంటనే శ్రీనివాసరావు 112 నంబర్‌కు ఫోన్‌ చేసి దాడి ఘటనను తెలియజేశారు. దీనిపై శుక్రవారం కేసు పెట్టేందుకు వెళ్తే స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకున్నా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు శరీరంపై గాయాలు లేవని చెప్పి కేసు నమోదు చేయలేదు. దీంతో శనివారం వైఎస్సార్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, పలువురు పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. తనపై రావాడ శ్రీనివాసరావు దాడి చేసినట్లు చల్ల ముకుందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పాముకాటుతో ఇద్దరి మహిళలు మృతి

నరసన్నపేట : బాడాం ఉన్నత పాఠశాలలో వంట ఆయాగా పనిచేస్తున్న చల్ల రాములమ్మ(45) పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 25న ఇంట్లో పాముకాటుకు గురి కాగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మ భర్త ఆదినారాయణకు రెండేళ్ల నుంచి కళ్లు కనిపించడం లేదు. డిగ్రీ చదువుతున్న కుమార్తె, ఇంటర్‌ చదువుతున్న కుమారుడు ఉన్నారు.

అక్కులపేటలో..

ఆమదాలవలస : అక్కులపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి సావిత్రి(60) శనివారం పాముకాటుకు గురైంది. పొలం గట్టు చుట్టూ కలుపు మొక్కలు కోసే క్రమంలో పాముకాటు వేయగా గ్రామానికి చేరుకుని స్పృహ తప్పిపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమదాలవలస శివారులోని రాధాకృష్ణపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. సావిత్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement