10న జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

10న జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపిక

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

● అండర్‌–14, 16 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు

● నవంబర్‌ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌ వేదికగా మెగా స్పోర్ట్స్‌మీట్‌

శ్రీకాకుళం న్యూకాలనీ : ప్రతిభ కలిగిన అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు శుభవార్త. స్టేట్‌మీట్‌ లేకుండానే నేరుగా ఆలిండియా నేషనల్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే సువర్ణ అవకాశం వచ్చింది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా జాతీయ అంతర్‌ జిల్లాల జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 10న నిర్వహించాలని నిర్ణయించారు. అథ్లెటిక్స్‌ సంఘం రాష్ట్ర చైర్మన్‌ కొన్న వెంకటేశ్వరరావు(వాసు) ఆదేశాల మేరకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అండర్‌–14, 16 విభాగాల్లో..

డైరెక్ట్‌ నేషనల్స్‌ పోటీలు అండర్‌–14, 16 విభాగాల్లో జరగనుండటంతో రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులను అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్‌ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌ వేదికగా జరగనున్న 20వ నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులను పంపించనున్నారు.

ఎవరు అర్హులంటే..?

అండర్‌–14 విభాగానికి 2012 నవంబర్‌ 17 నుంచి 2014 నవంబర్‌ 16 మధ్య జన్మించిన వారు అర్హులు. అండర్‌–16 విభాగానికి 2010 నవంబర్‌ 17 నుంచి 2012 నవంబర్‌ 16 మధ్య జన్మించి ఉండాలని నిర్వాహకులు స్పష్టంచేస్తున్నారు. జిల్లా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, లేదా టెన్త్‌మార్క్స్‌ మెమో, ఆధార్‌కార్డుతో స్టేడియం వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అథ్లెటిక్స్‌ సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు (9441570361) నంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement