నేడు స్కూల్‌గేమ్స్‌ క్రీడా ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేడు స్కూల్‌గేమ్స్‌ క్రీడా ఎంపికలు

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా స్కూల్‌గేమ్స్‌ షెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఎంపిక పోటీలు ఆదివారం మరో నాలుగు క్రీడాంశాల్లో నిర్వహించనున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా ఎస్‌జీఎఫ్‌ అధికారులు, జిల్లా కార్యదర్శులు చల్లా జగ దీష్‌, జీఎం జ్యోతిరాణి ఏర్పాట్లు చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌, హ్యాండ్‌బాల్‌, బాక్సింగ్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ అండర్‌–17, 19 బాలబాలికల ఎంపికలు పెద్దపాడులోని శ్రీరెయ్యమ్మ తల్లి వ్యాయామశాల వద్ద ఉదయం 10 గంటలకు మొదలుకానున్నాయి. హ్యాండ్‌బాల్‌ అండర్‌ – 14, 17 బాలుర ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతాయి. బాక్సింగ్‌ అండర్‌–14 బాలురు, అండర్‌–17, 19 బాలబాలికలకు కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు షురూ కానున్నాయి. సాఫ్ట్‌బాల్‌ అండర్‌–19 బాలబాలికలకు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం వేదికగా ఉదయం 10 గంటలకు ఎంపికల ప్రక్రియ ఆరంభమౌతుందని ఎస్‌జీఎఫ్‌ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement