నరసన్నపేట: జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ కోచింగ్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు గొలివి మోహనరావు, సాఫ్ట్ బాల్ జిల్లా అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వి.రమణ అన్నారు. నరసన్నపేటలోని పీఎంశ్రీ స్కూల్లో పది రోజుల కోచింగ్ క్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ (అండర్–18 ) విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 13 నుంచి 15 వరకు కడప జిల్లా పుల్లంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో కోచింగ్ ఇస్తున్నామన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ పది రోజుల క్రీడాకారులకు అవసరమైన ఆహారం అందించేందుకు ముందుకువచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత జవాన్‌కు ఘన స్వాగతం
వజ్రపుకొత్తూరు: పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గొరకల సోమేశ్వరరావు ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు, సైనిక సేవా సమితి, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. పలాస రైల్వే స్టేషన్ నుంచి స్వగ్రామం వరకు సుమారు 15 కిలో మీటర్లు మేర ఊరేగింపు నిర్వహించారు. సైన్యంలో 24 ఏళ్లు పాటు సేవలందించి అస్సాంలోని మిస్సామారీ రిజమెంట్‌లో హవల్దార్‌గా రిటైరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు సన్మాన కార్యక్రమంలో సైనికసేవా సమితి అధ్యక్షుడు అప్పారావు మాట్లాడుతూ సోమేశ్వరరావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఐ.అప్పారావు, గొరకల విశ్వనాథం, యువ సేవ సంఘం అధ్యక్షుడు బొడ్డు రామారావు, మాజీ, ఎంపీపీ, సర్పంచ్ గొరకల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుతో వృద్ధుడి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: శివరాంపురం గ్రామానికి చెందిన దట్టి బోడయ్య(80) పాముకాటుకు గురై మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బోడయ్య బుధవారం గ్రామానికి దగ్గరలో ఉన్న లంక గ్రామ పరిసరాల్లో గేదెలను మేతకు తీసుకువెళ్లాడు. ఈ సమయంలో పాము కాటు వేయడంతో బోడయ్యను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బోడయ్యకు భార్య సరసమ్మ, కుమారుడు హేమసుందర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


