శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీల్లో ఇటీవలి వాయిదా పడిన ఫుట్‌బాల్ ఎంపికలను శుక్రవారం అధికారులు పూర్తిచేశారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ పెడరేషన్ చేపడుతున్న స్కూల్‌గేమ్స్ విడతలవారీ ఎంపికలను నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది బాలబాలికలు హాజరయ్యారు. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను చేపట్టి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రపోటీలకు ఎంపికచేసినట్టు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ చల్లా జగదీష్ తెలిపారు. డీఈఓతోపాటు పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.తవిటయ్య, ఎం.వి.రమణ సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ మహిళా కార్యదర్శి జీఎం జ్యోతిరాణి, గేమ్ ఇన్‌చార్జ్‌లు బి.నిర్మల్ కృష్ణ, టి.లక్ష్మణరావు, రెడ్డి రవి, ఆర్.స్వాతి, ఎస్.శ్రీనివాసరావు, కె.రవికుమార్ పాల్గొన్నారు.


