శ్రీకాకుళం అర్బన్: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు వెంటనే కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి, ఐసీడీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం శ్రీకాకుళంలో నగర మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.జ్యోతి, అప్పలనరసమ్మ, విజయలక్ష్మి, భవాని, అక్కప్ప, రమాదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం: అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కొండములగాంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.


