బీసీలను ఇంకెంత కాలం మోసం చేస్తారు..? | - | Sakshi
Sakshi News home page

బీసీలను ఇంకెంత కాలం మోసం చేస్తారు..?

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

● సర్కారుకు ధర్మాన కృష్ణదాస్‌ సూటి ప్రశ్న

నరసన్నపేట: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇంకా బీసీలకు మోసం చేసేందుకు, మభ్య పెట్టేందుకు చూడటంపై మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మండి పడ్డారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలు చేస్తున్నట్లు ఒక జీఓను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు ఇది మోసమని వైఎస్సార్‌సీపీ చెప్పిందని, ఇప్పుడు 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు చంద్రబాబు చేసిన 105,1065 జీఓలు సరైనవి కాదని హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు డ్రామా బట్ట బయలైందని ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దానికి విరుద్ధంగా చట్టబద్ధత లేని జీఓలు ఇచ్చి బీసీలకు చంద్రబాబు తీవ్ర గందరగోళానికి గురి చే శారని కృష్ణదాస్‌ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యంలో ఉండీ రిజర్వేషన్లపై చట్టబద్ధం చేసే చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించడం కూడా మోసమేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement