బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే విధానాన్ని అవలంబిస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీం కోర్టు తీర్పులు అమల్లో ఉండగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీఓలు ఇవ్వడం ఏంటి. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లకు చట్ట రక్షణ కల్పించాలి. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఏ జీఓలూ లేకపోయినా వైఎస్సార్‌సీపీ బీసీలకు స్థానిక సంస్థల్లో 40 శాతం వరకు ప్రాతినిథ్యం క ల్పించింది.
– నర్తు నరేంద్ర యాదవ్,
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి


