సంతబొమ్మాళి: తాళ్లవలస సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతునాయుడుపేట గ్రామానికి చెందిన పరపటి ఆనందరావు తన భార్య గున్నమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై టెక్కలి వెవెళుతున్నారు. అదే రూట్‌లో కోటపాడుకు చెందిన కొయ్యాని చంటి టెక్కలి నుంచి స్వగ్రామం వస్తుండగా తాళ్లవలస సమీపంలో పరస్పరం ఢీకొన్నారు. ముగ్గురూ గాయపడటంతో 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చంటి పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు.


