మర్యాదపూర్వక భేటీ | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక భేటీ

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

మర్యాదపూర్వక భేటీ జేఆర్‌ఎఫ్‌ ఎంట్రన్స్‌లో 12వ ర్యాంకు బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు రావివలసలో ఇల్లు దగ్ధం వివాహిత ఆత్మహత్య న్యాయవాదుల విధుల బహిష్కరణ

మాజీ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మర్యాదపూర్వకంగా కలిశారు.

– హిరమండలం

కవిటి: జగతి గ్రామానికి చెందిన దిక్కల అభిమ న్యు జేఆర్‌ఎఫ్‌ ఎంట్రన్స్‌ లో 12వ ర్యాంక్‌ సాధించాడు. ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని బాపట్ల కళాశాలలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తిచేసిన అభిమ న్యు ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రవేశపరీక్షలో ఈ ర్యాంకు సాధించాడు. అభిమన్యు విజయం పట్ల తల్లిదండ్రులు దిక్కల జగదీష్‌, సనపల మంజుల(జిల్లాకోర్టు సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌), గ్రామపెద్దలు పూడి నేతాజీ, పూడి వరప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు.

రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విజయనగ రం వెళుతున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యా హ్నం కోష్ఠ జంక్షన్‌లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సంచాం గ్రామానికి చెందిన గొర్లె హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని జె.ఆర్‌.పు రం ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించారు. కోస్టాలో ఆటోలు, ఇతర దుకాణాలు ఫుట్‌పాత్‌పై ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

టెక్కలి రూరల్‌: రావివలసలో కె.కాంతమ్మకు చెందిన రేకు ఇల్లు గురువారం దగ్ధమైంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో సామగ్రీ మొత్తం కాలిపోయింది. స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.

ఎచ్చెర్ల : మండలంలోని నవభారత్‌ జంక్షన్‌ వద్ద వరం కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న యతిరాజుల పద్మావతి (41) అనే వివాహిత బుధవారం ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సంతానం కూడా లేదు. దీంతో మనస్థాపానికి గురై భర్త లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. వీరి స్వగ్రామం ఆమదాలవలస కాగా, కొంతకాలంగా వరం కాలనీలో ఉంటున్నారు. ఈమె భర్త శ్రీనివాసరావు రణస్థలం మండలం కొచ్చెర్లలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడు బుడుమూరు ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సమస్యల పరిష్కారం కోరుతూ రెండో రోజు గురువారం కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లాకు మంజూరైన కొత్త కోర్టులు జిల్లా కోర్టు ఆవరణలోనే ఏర్పాటు చేయాలని, ఇతర న్యాయపరమైన వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూన రాజారావు, కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ, బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, అసో సియేషన్‌ సభ్యులు డి.ఈశ్వరరావు, సుభాష్‌, విజయ్‌కుమార్‌, ఏఎల్‌ఎన్‌, కొమ్ము రమణమూర్తి, భవానీ శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement