విజయవంతంగా 500 ప్లస్‌ రోబోటిక్‌ సర్జరీలు | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా 500 ప్లస్‌ రోబోటిక్‌ సర్జరీలు

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

విజయవంతంగా 500 ప్లస్‌ రోబోటిక్‌ సర్జరీలు

ఎంవీపీకాలనీ (విశాఖ): విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో 500 రోబోటిక్‌ క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి క్యాన్సర్‌ హాస్పటల్‌గా ఎంజీ క్యాన్సర్‌ హాస్పటల్‌ నిలిచిందన్నారు. కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ బి.మురళీధర్‌ మాట్లాడుతూ శరీరంలోని ఇరుకై న భాగాల్లో మరింత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రోబోటిక్‌ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సత్య విజయ్‌ చిగురుపాటి, యూరో ఆంకాలజిస్ట్‌–రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రాహుల్‌ తేజ్‌, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రేమ్‌ కమల్‌ పట్నాల, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ గుడ్ల అనంత సాయికుమార్‌, కన్సల్టెంట్‌ గైనెక్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ హరిత మద్దిరాల తదితరులు రోబోటిక్‌ సర్జరీల ద్వారా క్లిష్టమైన కేసుల్లో అందించిన వైద్య సేవల అనుభవాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement