శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికై నట్టు తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా నుంచి సబ్‌జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పెద్దిన గగన్, బెండి వేదశ్రీ, కారే మోక్షిత్, తాన్ని ఢిల్లీశ్వరరావు, గుర్రాల హేమచందన్ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బృందానికి కోచ్‌గా కొమర మోహన్‌కృష్ణ నియమితులయ్యారు. వీరిని గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అతిధులు, వైద్యులు అభినందించారు. కార్యక్రమలో గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్, డాక్టర్ ఇజ్జపు రెడ్డి శిరీష, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ వాసుదేవరావు, జిల్లా ఉషు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్, రెడ్డి సాయిరాం, కె.మోహనకృష్ణ, లోకేష్, మురళి, జి.లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.


