ఎచ్చెర్ల: ఎస్‌ఎస్‌ఆర్‌పురం గ్రామంలోని సర్వే నంబరు–1లో ఉన్న మూడు వందల ఎకరాల స్థలాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ గురువారం పరిశీలించా రు. ఈ స్థలం 22–ఏ జాబితాలోకి వెళ్లి పోయి నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయిందని, అడవి పోరంబోకుగా ఉందని, ఈ భూముల్లో రీసర్వే చేయడం లేదని సాగు చేస్తున్న రైతులంతా గతంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. ఈ నేపథ్యంలో జేసీ స్థలాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి నిర్ణ యం తీసుకుంటామని రైతులకు తెలియజేశారు. అదే విధంగా, పెయ్యిలవానిపేటలో చెరువు ఆక్రమణకు గురవుతోందన్న ఫిర్యాదు మేరకు అక్కడ కూడా పరిశీలించారు. ఈయనతో పాటు తహసీల్దా ర్ బి.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


