ఆదుకోండయ్యా..! | - | Sakshi
Sakshi News home page

ఆదుకోండయ్యా..!

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

● రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న యువకుడు ● ఆస్పత్రి ఖర్చుల కోసం కుటుంబ సభ్యుల ఆవేదన

● రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న యువకుడు ● ఆస్పత్రి ఖర్చుల కోసం కుటుంబ సభ్యుల ఆవేదన

వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు పంచాయతీ పెద అంగవానిపేటకు చెందిన అంగ ధర్మారావు రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తున్న అంగ ధర్మారావు పెద్ద మురహరిపురం గ్రామం సమీపంలోకి వెళ్లేసరికి శిథిలమైన రహదారిలో ఉన్న గోతిలో నుంచి బైక్‌ వెళ్లడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి కాలికి బలమైన గాయమైంది. హుటాహుటిన స్థానికులు పలాసలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స చేసిన వైద్యులు కుడికాలు దెబ్బతిందని.. మెరుగైన వైద్యం కోసం వైజాగ్‌ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు తక్షణమే ఆపరేషన్‌ చేసి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆస్పత్రికి అయ్యే ఖర్చుల కోసం దాతల సహకారం కోరుతున్నారు. దాతలు కనికరించి 63097 94409 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement