మైనింగ్‌ తవ్వకాలు విరమించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ తవ్వకాలు విరమించుకోవాలి

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

కంచిలి:

రిజర్వ్‌డు ఫారెస్ట్‌ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలను విరమించుకోవాలని సీపీఐ పార్టీ నేత అయినింటి లోకనాథం డిమాండ్‌ చేశారు. మండలంలోని నువాగడ పంచాయతీ పరిధి సర్వే నంబర్‌ 47లో నల్లరాయి కొండను తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రక్రియను సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు బుధవారం అడ్డుకున్నారు. తమకు అనుమతులున్నాయంటూ కొందరు వ్యక్తులు కొండరాళ్లను పేల్చడానికి రంధ్రాలు చేయడం గ్రామస్తులు గమనించారు. దీంతో సీపీఐ నేతలకు సమాచారం ఇవ్వడంతో.. గ్రామస్తులతో కలిసి ఆ కొండలో రంధ్రాలు వేసిన ప్రదేశానికి వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఈ కొండను తవ్వడానికి ప్రయత్నించినప్పటికీ సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు అడ్డుకున్నారు. తాజాగా మళ్లీ అనుమతులున్నాయంటూ తవ్వకాలు జరపడానికి ప్రయత్నం చేయడం ఏంటని అక్కడ ఆ పనులు చేస్తున్న వ్యక్తుల్ని నిలదీశారు. కొండ తవ్వకాలు చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, మైనింగ్‌ అధికారులు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు, రైతులు, ప్రకృతితో ఆటలాడడం మానుకోవాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement