మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన గిన్ని పద్మావతి (57) అనే మహిళ బుధవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతిరాలి భర్త ఇదివరకే చనిపోవడంతో అప్పటినుంచి మతిస్థిమితం కోల్పోయి చిన్న కుమారుడు కోటేశ్వరరావు దగ్గర ఉంటుంది. ఎప్పటికప్పుడు వీధిలో కేకలు వేస్తూ ఉండేది. ఎక్కడికెళ్లినా రెండు, మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేది. ఇటీవల గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గ్రామస్తులు రక్షించారు. కాగా బుధవారం కుమారుడు కోటేశ్వరరావు పని నిమిత్తం బయటకు వెళ్లగా.. కోడలు గాయత్రి పలాసలోని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న పద్మావతి చెరువుకి వెళ్లి స్నానం చేసి ఇంటికొచ్చి అపస్మారక స్థితిలో పడి ఉంది. వీధిలో ఉన్నవారు చూసి కుమారుడికి సమాచారం ఇవ్వడంతో ముందు నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి టెక్కలి జిల్లా అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. బ్లేడుతో చేయి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని, సూపర్‌ వాస్మల్‌ 33 అయిల్‌ తాగి ఉండవచ్చునని కుమారుడు ఫిర్యాదులో తెలిపారు. ఎవరిపైనా అనుమానం లేదని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement