10 నుంచి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

10 నుంచి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షణ

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

శ్రీకాకుళం కల్చరల్‌: విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్రస్థాయి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహన్‌రావు అన్నారు. అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ క్రాస్‌ శిక్షణ, లెర్నింగ్‌ కార్యక్రమంపై మంగళవారం జిల్లా రెడ్‌క్రాస్‌ పరిపాలన భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. షెడ్యూల్‌, నిపుణుల ఎంపిక, వసతి, రవాణా, ఇతర ప్రాథమిక వసతుల కల్పనకై చర్చించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.సుధీర్‌, కోశాధికారి కె.దుర్గ శ్రీనివాస్‌, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు బి.చిన్మయ్‌రావు, పి.శ్రీకాంత్‌, నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, పి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement