యువకుడు అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

యువకుడు అనుమానాస్పద మృతి

నరసన్నపేట: స్థానిక పచూరి కాలనీలో నివాసముంటున్న గరికి అనిల్‌కుమార్‌ (34) అనుమానాస్పదంగా మంగళవారం వేకువజామున మృతి చెందాడు. ఇళ్లరికం వచ్చిన అనిల్‌కుమార్‌ భార్య పార్వతితో కలిసి పచూరికాలనీలో నివాసముంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన అనిల్‌ రాత్రి వరకూ లేవకపోవడంతో భార్య గమనించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారాన్ని శ్రీకాకుళం రెడ్డికివీధిలో ఉంటున్న తల్లి గరికి లక్ష్మికి తెలియజేయగా ఆమె వచ్చి కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా చనిపోవడం ఏంటని ఆందోళన చెందారు. కోరుకున్న అమ్మాయితో వివాహం చేశానని, పెళ్లయిన ఏడాది వరకూ అందరం కలిసే ఉన్నామని, తరువాత భార్య ఇంటికి వచ్చేశాడని తెలిపింది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఇంతలో అనిల్‌ చనిపోవడం దారుణమని వాపోయింది.

పోస్టుమార్టం చేసేందుకు అవస్థలు..

అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక షెడ్‌ వద్దకు తీసుకురాగా పీఎం చేసే సిబ్బంది, బంధువులు అవస్థలు పడ్డారు. రోడ్డంతా బురదమయంగా మారడంతో దూరంలోనే అంబులెన్స్‌ నిలిపి షెడ్‌ వరకూ మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీవేంకటేశ్వర వెటర్నరీ

యూనివర్సిటీ వీసీగా వైకుంఠరావు

సారవకోట : స్థానిక వండానవలసకు చెందిన వెలమల వైకుంఠరావు తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీవేంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు. దీంతో స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1993లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వైకుంఠరావు పాడి రైతులకు విశేష సేవలు అందించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా అవార్డు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement