ఉత్సాహంగా పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

శ్రీకాకుళం రూరల్‌:

నూతనంగా ఎంపికై న పోలీసు కానిస్టేబుళ్లు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. జిల్లాలోని తండేవలసలో గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్‌ పోలీసు కానిస్టేబుల్స్‌ (2025–26 6వబ్యాచ్‌) ప్రాథమిక శిక్షణ ముగించుకొని మంగళవారం నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌ పరేడ్‌) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా మంత్రి గౌరవవందనం స్వీరించగా, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డిలతో కలిసి కవాతును పరిశీలించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని చట్టపరిధిలో తక్షణం స్పందించాలన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 9నెలలు పాటు కఠిన శిక్షణ పొందిన 142 మంది క్యాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగి ఈ బ్యాచ్‌ సభ్యులు సీసీటిఎన్‌ఎస్‌తో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేర దర్యాప్తులో రాణించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement