బస్‌ షెల్టర్‌ స్థలం కబ్జా | - | Sakshi
Sakshi News home page

బస్‌ షెల్టర్‌ స్థలం కబ్జా

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

● నిర్మాణానికి సిద్ధమైన టీడీపీ నాయకుడు

● రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు

టెక్కలి : డివిజన్‌ కేంద్రమైన టెక్కలి బ్రాహ్మణవీధి జంక్షన్‌లో పాత జాతీయ రహదారికి ఆనుకుని దశాబ్దాలుగా ఉన్న బస్‌ షెల్టర్‌ స్థలాన్ని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. ఆ స్థలంలో నిర్మాణ పనులు చేయడానికి మంగళవారం సిద్ధం కాగా ఆ ప్రాంతానికి చెందిన స్థానికులతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తక్షణమే బస్‌ షెల్టర్‌ స్థలం కబ్జాను ఆపాలని ఆర్డీఓతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల క్రితం షెల్టర్‌ శిథిలావస్థకు చేరుకోగా ఆ స్థలంలో మరళా బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేయాలని స్థానికులు గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో ఆ స్థలంపై అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడి కన్ను పడింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నర్సింగ్‌నాథ్‌ సాబతో, బర్ల కార్తీక్‌, ప్రసాద్‌ ప్రధానో, స్థానికులు డి.గిరి, కె.శ్రీను, కె.శంకర్‌, శివపండా తదితరులు నిర్మాణం పనులను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికై నా కబ్జా ప్రయత్నాలు ఆపకపోతే స్థానికంగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement