అక్టోబర్‌ 4న చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 4న చదరంగం పోటీలు

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

అక్టోబర్‌ 4న చదరంగం పోటీలు

టెక్కలి: స్థానిక అల్ఫాజెన్‌ పాఠశాలలో అక్టోబర్‌ 4న జిల్లాస్థాయి స్కూల్‌ ర్యాంకింగ్‌ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఆలిండియా చెస్‌ ఇన్‌ స్కూల్స్‌ కమిటీ సభ్యుడు ఎస్‌.భీమారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఏళ్లలోపు వయసు కలిగిన బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన జమ్మ ఎర్రమ్మకు చెందిన పాడిగేదె విద్యుత్‌ షాక్‌తో సోమవారం సాయంత్రం మృతి చెందింది. చేపల మార్కెట్‌ వెనుక మేత మేస్తుండగా మోటారుకు చెందిన విద్యుత్‌ వైరు తగలడంతో మృతి చెందిందని బాధితురాలు తెలిపారు. సుమారు రూ.60 వేల విలువ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయాలని కోరారు.

వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కనుగులవానిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనుగుల అప్పలనాయుడు (67) సోమవారం రాత్రి పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హటాహుటిన శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న ఆటో

● ఇద్దరికి గాయాలు

ఆమదాలవలస: పాలకొండ వైపు నుంచి విశాఖపట్నం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఆటో ఢీకొనడంతో గాయాలపాలైన ఘటన సోమవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీశ్వరునిపేట జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన ఉప్పాడ బైరవ్‌ కృష్ణకుమార్‌ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పాలకొండ వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. పార్వతీశ్వరునిపేట జంక్షన్‌ వద్ద ఆమదాలవలస వైపు నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైరవ్‌ కృష్ణకుమార్‌తో పాటు అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement