సమన్వయంతో పరేడ్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పరేడ్‌ నిర్వహించాలి

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

● జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం రూరల్‌: జిల్లా కేంద్రంలోని తండేవలస శిక్షణ కేంద్రంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది స్టైఫెండియరీ క్యాడెడ్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్స్‌ (ఎస్‌సీటీపీసీఎస్‌)ను ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి సోమవారం కలిశారు. ముందుగా అవుట్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కవాతు, డ్రిల్‌, మార్చ్‌పాస్ట్‌, కమాండింగ్‌ గౌరవ వందనం, అడుగుల సమన్వయం, వరుసలు, దూరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి పేరేడ్‌లో పూర్తిస్థాయి క్రమశిక్షణ, ఏకరూపత, సమన్వయం, ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. దీక్షాంత్‌ పెరేడ్‌ను ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement