అదేంటి ఇంజిన్ ఆయిల్‌ను వాటర్ బాటిల్‌లో పట్టుకుని చూపిస్తున్నారు అనుకుంటున్నారా..? అదేమీ ఇంజిన్ ఆయిల్ కాదు అచ్చంగా ప్రభుత్వం వారు కుళాయిల ద్వారా బొంతలకోడూరుకు సరఫరా చేసిన ‘మంచినీరు’. ఈ బాటిల్ పట్టుకున్న వ్యక్తి ఆ ఊరి వాసి రాజన్న. ఇక్కడ కుళాయిలకు వచ్చే పైపులైన్‌ను కాలువ కింద నుంచి వేశారు. ఈ పైపులైన్ లీక్ కావడంతో కాలువ నీరు కలిసిపోయి ఇళ్లకు మురికి నీరు వస్తోంది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. – ఎచ్చెర్ల
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో లలితా రాణి
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీమ్ వర్క్‌తో 12.18 కిలోమీటర్ల పొడవైన భారత జాతీయ జెండాలను క్రోషేతో అల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నట్లు చల్లా లలితా రాణి ఓ ప్రకటనలో తెలిపారు. 2026 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, ఈ ప్రత్యేక ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషంగా నిలిచింది.
– శ్రీకాకుళం కల్చరల్


