విజయమ్మ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

విజయమ్మ సేవలు అభినందనీయం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కిడ్నీ రోగులకు డయాలసిస్‌ చేసేందుకు ఉచితంగా అంబులెన్స్‌ అందించి ఉద్దాన ప్రాంతాన్ని ఊపిరిగా భావించిన విజయసాయిరాజ్‌ సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. కాళింగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో జెడ్పీ తాజా మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు మాట్లాడుతూ విజయమ్మ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయించి తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. అనంతరం పిరియా విజయ మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా తనను ఆదరించారని, చైర్మన్‌ పదవిని అప్పగించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌, పిరియా సాయిరాజ్‌, సూర శ్రీనివాసరావు, రిటైర్డ్‌ జిల్లా జడ్జి సింగూరు మోహనరావు, రోణంకి కృష్ణంనాయుడు, తమ్మినేని వాణమ్మ, తమ్మినేని చిరంజీవినాగ్‌, బల్ల గిరిబాబు, మార్పు పృథ్వీ, దానేటి శ్రీధర్‌, మొదలవలస రమేష్‌, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలరావు, డాక్టర్‌ సింధూర, డాక్టర్‌ పి.జె నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement