సొంత ఖర్చుతో ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

సొంత ఖర్చుతో ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

టెక్కలి: టెక్కలి మండలం పోలవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యతో మూలకు చేరింది. దీంతో ఎగువ ప్రాంతాల రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ట్రాన్స్‌ఫార్మర్‌ బాగు చేసేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు గ్రామానికి చెందిన ప్రగడ సాయిరామ్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో రైతులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సుమారు రూ.3.20 లక్షలను అందజేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా సాయిరామ్‌ను గ్రామస్తులు అభినందించారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ జి.బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ బి.కూర్మారావు, మెట్ట అవినాష్‌, మెట్ట విశ్వనాధం, మెట్ట వెంకట్రావు, డి.లక్ష్మణ, నాగార్జున, కిషోర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement