నిర్లక్ష్యం వహిస్తే షాక్‌ తప్పదు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహిస్తే షాక్‌ తప్పదు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

జాగ్రత్తలే శ్రీరామరక్ష

హిరమండలం: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు విద్యుత్‌ పరికరాలు తడిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ,ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం ధాటికి వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా ఆ శాఖ వారికి సమాచారం ఇవ్వాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

● తడిచేతులతో వైర్లు, స్విచ్‌లు తాకొద్దు.

● విద్యుత్‌ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయవద్దు.

● విద్యుత్‌ సిబ్బంది సెల్‌ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి.

● వీధులు, పొలాల్లో తడిచిన స్తంభాలను తాకవద్దు.

● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడితే 1912కు కాల్‌ చేయాలి.

● తీగలు తాకిన చెట్లను ముట్టుకోవద్దు.

● విద్యుత్‌ తీగలను ఆనుకుని దుస్తులు ఆరబెట్టకూడదు.

● విద్యుత్‌ షాక్‌కు గురైతే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్‌ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి.

వర్షాకాలంలో విద్యుత్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు బారిన పడే అవకాశాలున్నాయి. విద్యుత్‌ తీగలు తెగిపడితే వెంటనే సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం.

– జి.ప్రసాదరావు, డీఈఈ,

పాతపట్నం సబ్‌ డివిజన్‌

వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా విద్యుత్‌ పరికరాలు

అప్రమత్తతంగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం

జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement