సోంపేట: పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వెనుక ఇంటి నిర్మాణం కోసం తీసిన పెద్ద గొయ్యిలో ఆదివారం ఓ గేదె పడింది. నీరు ఉండటంతో బయటకు వచ్చే వీలు లేక రైతులు అగ్నిమాపక శాఖాధికారులను సంప్రదించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోప్ సహాయంతో గేదెను సురక్షితంగా బయటకు తీసి యజమానికి అప్పగించారు. అగ్నిమాపక శాఖాధికారి సూర్యారావు, సిబ్బంది విజయ్ కుమార్, నరేష్,బాబురావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.
కాష్యూ స్టార్టప్‌కు ప్రభుత్వ గుర్తింపు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అభివృద్ధి చేస్తున్న కాష్యూ హబ్ స్టార్టప్‌కు డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా గుర్తింపు లభించింది. ఐతం రైజ్ ఇంక్యుబేటర్ సీఈఓ బి.మనోజ్‌కుమార్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు కె.విష్ణువర్ధన్, జి.అరవింద్‌స్వామి, డి.తరుణ్‌కుమార్ తదితరులు ఈ స్టార్టప్‌కు రూపకల్పన చేశారు. జీడి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సులభతరంగా జీడి ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా రూపొందించిన ఈ స్టార్టప్‌కు భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. స్టార్టప్‌ను మరింత అభివృద్ది చేసేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌కేవీవై రాప్టర్ కార్యక్రమం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే జాతీయ స్థాయి స్టార్టప్ కార్యక్రమాల్లో త స్టార్టప్‌కు ప్రత్యేక గుర్తింపు లభించినట్లుతెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కళాశాల యాజమాన్యం ఆదివారం విద్యార్థుల బృందాన్ని అభినందించారు.


