స్కూల్‌గేమ్స్‌ పోరు ఆరంభం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌గేమ్స్‌ పోరు ఆరంభం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఎంపిక ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌గేమ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌కు క్రీడాకారులు పోటెత్తారు. మొత్తం 34 క్రీడాంశాల్లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీల షెడ్యూల్‌కు అనుగుణంగా తొలుత ఆరు క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జూడో, రెజ్లింగ్‌, గట్కా, లాన్‌టెన్నిస్‌, రగ్బీ క్రీడాంశాల్లో ఎంపికలను పూర్తిచేశారు. చెస్‌ అండర్‌–19 బాలబాలికల ఎంపికలు సోమవారం ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జూడో ఎంపికలను శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో, రెజ్లింగ్‌ ఎంపికలు పెద్దపాడులోని ఓ వ్యాయామశాలలో, గట్కా ఎంపికలను నరసన్నపేట మండలం సత్యవరం జెడ్పీహెచ్‌స్కూల్‌ వేదికగా, రగ్బీ ఎంపికలు టెక్కలి ప్రబుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, లాన్‌టెన్నీస్‌ శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని టెన్నీస్‌ కోర్టు వేదికగా ఎంపికల ప్రక్రియను నిర్వహించి పూర్తిచేశారు. త్వరలో తుది జట్లను ప్రకటించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి చల్లా జగదీష్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో లాన్‌టెన్నీస్‌, జూడో, రెజ్లింగ్‌ ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ చల్లా జగదీష్‌ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. డీఈఓ ఎ.రవిబాబు సెలక్షన్‌ ట్రయల్స్‌ తీరును ఎప్పటికప్పుడు నిర్వహన కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఆయా క్రీడాంశాల ఇన్‌చార్జిలతోపాటు సాధు శ్రీనివాసరావు, కె.రవికుమార్‌, పీడీ సంఘ ప్రతినిధులు, ఆయా క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్కలిలో జరిగిన రగ్బీ ఎంపికల్లో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, కార్య నిర్వాహక కార్యదర్శి సిహెచ్‌.జగదీష్‌, జి.ఎం.జ్యోతిరాణి, అసోషియేషన్‌ అధ్యక్షుడు డి.రామకృష్ణ, నిర్వాహకులు బి.నారాయణరావు, కె.రఘనాధరావు, ఎన్‌.జనార్ధన్‌రావు, కె.కె.రామిరెడ్డి, ఎస్‌.లక్ష్మణరావు, జి.శ్రీనివాసరావు, ఎన్‌.రమేష్‌, కె.ప్రకాశ్‌, ఆదిశేషు, సుజాత, నీలకంఠేశ్వర్రావు, అలివేణి, సీతయ్య పాల్గొన్నారు.

● జిల్లాలో మొదలైన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

● తొలుత ఐదు క్రీడాంశాల్లో సెలక్షన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement