జాతీయ సమైక్యతకు హిందీ దోహదం | - | Sakshi
Sakshi News home page

జాతీయ సమైక్యతకు హిందీ దోహదం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సమైక్యతకు జాతీయ భాష హిందీ ఎంతో అవసరమని డీఈఓ ఏ.రవిబాబు అన్నారు. హిందీ మంచ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని న్యూ సెంట్రల్‌ స్కూల్లో హిందీ పక్షోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యులు కోనే శ్రీధర్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 15 రోజులు పాటు హిందీ పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు.

విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ పట్ల విద్యార్థులకు ఉన్న అభిరుచి ప్రశంసనీయమన్నారు. విశ్రాంత సెట్‌శ్రీ సీఈఓ సురంగి మోహనరావు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ ప్రచారానికి ఎక్కడా జరగని కృషి శ్రీకాకుళం జిల్లాలో గత 20 ఏళ్లుగా జరుగుతోందని కొనియాడారు. హిందీ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు సి.ఎల్‌.నాయుడు, పండిత పరిషత్‌ రాష్ట్ర మహిళా కార్యదర్శి కనిమెట్ట పద్మావతి, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఐఎఫ్‌ డబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావు, న్యూ సెంట్రల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ పి.శ్రీకాంత్‌, కార్యక్రమ కన్వీనర్‌ బాడ మంజుల, హిందీ మంచ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌టీపీ శిరీష, సీనియర్‌ ఉపాధ్యాయ సంఘ నేత దొంతం పార్వతీశం, హిందీ మంచ్‌ పూర్వ అధ్యక్షులు సూరంపల్లి బ్రహ్మాజీ తదితరులు ప్రసంగించారు. అనంతరం డీఈఓ ఏ.రవిబాబు (విద్యారంగం), పోలుమహాంతి శ్రీకాంత్‌ (విద్యారంగం), ఎం.వి.మల్లేశ్వరరావు (జర్నలిజం), సురంగి మోహనరావు (సమాజ సేవ), సి.ఎల్‌ నాయుడు (హిందీరంగం), ముద్దాడ ఆదినారాయణ ( హిందీ ఉపాధ్యాయులు), పివీఎస్‌ఎన్‌ మూర్తి (హిందీ ప్రచారక్‌)లను ఘనంగా సత్కరించారు. హిందీ సులేఖన్‌ (హ్యాండ్‌ రైటింగ్‌), హిందీ దోహా రీడింగ్‌, ప్రియ కవి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement