బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతి

Sep 16 2026 4:19 AM | Updated on Sep 16 2026 4:19 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రణస్థలం: మండలంలోని పైడిభీమవరం జాతీ య రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎన్‌.భరణి (19) అనే యువకుడికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 13న విజయనగరంలో ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా పైడిభీమవరం దగ్గర బైక్‌ అదుపుతప్పి భరణి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరణిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. మంగళవారం ఉదయం అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఇతడిది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రెల్లవీధి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ వెల్లడించారు.

రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస పంచాయతీలో ఉన్న రావివలస జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆటో మంగళవారం మధ్యాహ్నం ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాస్‌, ఆమదాలవలస గ్రామానికి చెందిన ఎస్‌.మహేష్‌లు తీవ్రగాయాలు పాలయ్యారు. వీరిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై లావేరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఘనంగా ఇంజినీర్స్‌ డే

అరసవల్లి: శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ ఆవరణలో ఇంజినీర్స్‌ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ డిప్లమో ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో రక్తదా నశిబిరాన్ని నిర్వహించారు. పీఆర్‌ ఎస్‌ఈ వీఎస్‌ నగేష్‌బాబు, ఇంజినీర్ల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌వీఏ పోలినాయుడు, జి.రవిబాబు, ఉపాధ్యక్షుడు సామ్యూల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement