● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి.. | - | Sakshi
Sakshi News home page

● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని మద్యం దుకాణం వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement