ఈ ‘ఆదాయ’ పైత్యాన్ని ఏమందురు..? | - | Sakshi
Sakshi News home page

ఈ ‘ఆదాయ’ పైత్యాన్ని ఏమందురు..?

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

గుడులు, బడుల వద్ద మద్యం విక్రయాలు

బరి తెగిస్తున్న వ్యాపారులు

కొత్తూరు జంక్షన్‌లో గిరిజన బాలికల వసతి గృహం పక్కనే రెండు వైన్‌షాపులు

శ్రీకాకుళం, కాశీబుగ్గలో గుడులకు ఎదురుగా వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన బస్‌ షెల్టర్‌ సమీపంలో శ్రీరామమందిరం గుడికి ఎదురుగా 100 మీటర్ల లోపు ఉన్న మధు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ దృశ్యమిది. టీడీపీ నాయకుడు ఇప్పిలి మధుకు చెందిన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఇది. దీని పై ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా పెట్టుకుంది. దీనికి మద్యాన్నే మార్గంగా ఎంచుకుంది. ఇంకేముంది గుడి, బడి అని చూడటం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ మందు షాపులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య పెచ్చుమీరుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో వైన్‌షాపులుంటే అక్కడున్న బాలికల రక్షణ దేవుడికెరుక. అలాంటిది మందుబాబులు సంచరించే ఏరియాలో బాలికల వసతి గృహాలు ఉంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అనుమతి ఎలా ఇచ్చారో..!

● కొత్తూరు జంక్షన్‌లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహాన్నే తీసుకోండి.. ఒక వైన్‌షాపు పక్కనున్న కాంప్లెక్స్‌లో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన కొన్ని నెలలకు మరో వైన్‌షాపు అక్కడ పెట్టారు.

● వైన్‌షాపు పక్కన గిరిజన బాలికల వసతి గృహం ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది.

● బాలికల వసతి గృహం ఉన్న దగ్గరలో కొత్తగా మరో వైన్‌షాపు ఏర్పాటు చేసేందుకు ఎకై ్సజ్‌ అధికారులు అనుమతి ఇవ్వడం మరింత విచిత్రం.

● ఇక్కడ ఇరు శాఖల అధికారుల తప్పులూ ఉన్నాయి.

● టీడీపీకి చెందిన వ్యక్తి వైన్‌షాపు కావడంతోనే అనుమతులు వచ్చేశాయని అంటున్నారు. మొత్తానికి పైఅంతస్తులోని వసతి గృహంలో ఉంటున్న బాలికలు కిందకి దిగి ప్రతి రోజూ ఆ వైన్‌షాపుల ముందు నుంచే వెళ్లాల్సి వస్తోంది.

గుడి.. బడి.. ఏదైతే మాకేంటి..!

గుడుల వద్ద వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు కొదవ లేదు. దేవదాయ శాఖ పరిధిలోకి రాలేదని చెప్పి జిల్లాలో పలు దేవాలయాల పక్కన, ఎదురుగా వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు ఎకై ్సజ్‌ అధికారులు అనుమతులిచ్చేశారు. అవన్నీ టీడీపీ నేతలకు చెందినవి కావడంతో స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పవిత్రమైన దేవాలయాల వద్దకు వెళ్లే భక్తులకు వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు దర్శనం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా స్థలం లేనట్టు దేవాలయాల దగ్గర వైన్‌షాపులు పెట్టడానికి వ్యాపారులకై నా మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. డబ్బు కోసం దేవాలయాలు, విద్యాలయాలు కూడా వదలరా అన్న చర్చ జరుగుతోంది.

కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్‌కు ఎదురుగా రామాలయం, షిర్డీ సాయి ఆలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా ఒక వైన్‌షాపు, ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉంది. ఇందులో ఒకటి నగర టీడీపీ నాయకుడిది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement