న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
నీటి మూటలు పట్టుకున్న నీలి మబ్బులు ఆకాశ వీధి నుంచి సిక్కోలుకు గొడుగు పట్టాయి. శనివారం సంధ్య వేళలో ఇలా కట్ట కట్టుకుని వచ్చిన మేఘాలు నగరాన్ని కమ్ముకున్నాయి. కానీ కాసిన్ని చినుకులు మాత్రమే చిలకరించి ఆశలపై నీళ్లు వదిలాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
నిలబడి చేసే ప్రాథమిక ఆసనాల్లో ఒకటి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఆసనంలో స్థిరంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
శరీరానికి మనస్సుకి ప్రశాంత ఇస్తుంది. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక రకాల ఆరోగ్య ప్ర యోజనాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.
భుజాల నుంచి చేతి వేళ్ల వరకు యాక్టివేషన్ జరుగుతుంది. తల కిందకి ఉండడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది.
వెన్నెముక, కాళ్లకు, చేతులకు బలం కలుగుతుంది. భుజాలు శక్తివంతమవుతాయి. కొవ్వు కరుగుతుంది. అతిమూత్రం, రక్తపోటు నివారిస్తుంది. పొట్ట పెరగకుండా అరికడుతుంది.
వెన్నుపాముకు శిరస్సుకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో సో మవారం ఒలింపిక్ డే రన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు తెలిపారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 22వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఒలింపిక్ డే రన్ ర్యాలీ జరుగుతుందని చెప్పా రు. శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి కళింగ రోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండ రోడ్, కృష్ణాపార్క్, డే అండ్ నైట్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నా రు. సమావేశం అనంతరం రన్ ముగుస్తుందని కృష్ణదాస్, సాంబమూర్తి తెలిపారు.
ఆమదాలవలస: పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ చెక్కును శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ రైతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీరు వీక్షించి అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మంజూరైన సహాయానికి సంబంధించిన పత్రాలు, నమూనా చెక్కులను సంయుక్తంగా పంపిణీ చేశారు.
నరసన్నపేట: స్థానిక 108 వాహన సిబ్బంది విశ్రాంతి తీసుకు నే గదిలో శనివా రం విషసర్పం హల్‌చల్ చేసింది. దీంతో పెదిలాపు రమణయ్యతో పాటు ఇతర సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. భయంతో పామును హతమార్చారు. ఎప్పటికప్పుడు తాము ఉంటున్న వంశధార క్వార్టర్స్‌లోని గదిలోకి పాములు వస్తున్నాయని, గది శిథిలమైందని, వర్షం పడితే కారుతోందని, ఇక్కడ ఉండేందుకు భయంగా ఉందని సిబ్బంది అంటున్నారు. మరో మంచి గదిని కే టాయించాలని కోరుతున్నారు. శనివారం సా యంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి విజ్ఞాపన పత్రమిచ్చామని రమణయ్య తెలిపారు.
నరసన్నపేట: కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని ఫ్యామిలీ జిల్లా కోర్టు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ అన్నా రు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం న్యాయవాదులు, పోలీసు అధికారులకు లోక్ అదాలత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జూలై 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇందులో నరసన్నపేట కోర్టుకు సంబంధించిన కేసులు వీలైనన్ని పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు.
సబ్‌జైల్ పరిశీలన..
అవగాహన కార్యక్రమం అనంతరం స్థానిక సబ్‌జైల్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కా ర్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి హరిబాబుతో కలిసి పరిశీలించారు. జైల్లో రిమాండ్ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెనుక స్థానిక సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్.వాణి, జైలు సూపరింటెండెంట్ విజయకుమార్ తదితరులు ఉన్నారు.
మెదడు నిండా ఆలోచనలు.. మనసు నిండా భయాలు.. లేనిపోని ఆందోళనలు.. కొత్త తరం ఎదుర్కొంటున్న సమస్యలివి. డిప్రెషన్, నిద్ర లేమి, అతిగా
ఆలోచించడం, ఏకాగ్రత లేకపోవడం.. ఇలాంటి సమస్యలన్నీ ఇదివరకు కంటే బాగా పెరిగిపోయాయి. వీటన్నంటికీ యోగా చక్కటి సమాధానమని నిపుణులు సూచిస్తున్నారు. నేడు యోగా దినోత్సవం. ఆసనాలతో ఆలోచనలు
మారుతాయని, యోగాతో జీవన శైలి మెరుగవుతుందని చెబుతున్నారు.
– శ్రీకాకుళం కల్చరల్
గత 39 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. వందల మందికి యోగా నేర్పించాను. 78 ఏళ్లు వచ్చినా యువకులతో సమానంగా 108 సూర్య నమస్కారాలు చేయిస్తుంటాను.
– ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ,
బీఎస్‌ఎన్‌ఎల్, శ్రీకాకుళం
యోగాతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక యోగాభ్యాసాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా యోగ విద్యను అభ్యసిస్తున్నారు.
– మావురి నాగేశ్వరరావు, యోగా గురువు
శ్రీకాకుళం రూరల్: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ బృందం సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం సింగుపురంలోని గౌతమి ట్రేడర్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఎరువుల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, రోజువారీ విక్రయాలను మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. ఎరువులతోపాటు ఇతర వస్తువులు అంటగట్టరాదని, బిల్లుపుస్తం, ఇన్‌వాయిస్‌లు తప్పనిసరిగా షాపులో అందుబాటులో ఉంచాలని సూచించారు.


